: ఛాంపియన్స్ ట్రోఫీ వార్మప్ మ్యాచ్: టీమిండియా విజయ లక్ష్యం 190 పరుగులు
వచ్చే నెల 1 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడానికి ఇంగ్లండ్ వెళ్లిన భారత జట్టు ఈ రోజు న్యూజిలాండ్తో వార్మప్ మ్యాచ్లో తలపడింది. లండన్లోని కెన్నింగ్టన్ లో జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు విజృంభించడంతో 34.4 ఓవర్లలో 189 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. భారత బౌలర్లతో షమీ, భువనేశ్వర్లకు చెరో మూడు వికెట్లు దక్కగా, జడేజాకు రెండు వికెట్లు దక్కాయి. 190 పరుగుల లక్ష్యఛేదనలో శిఖర్ ధావన్, రహానేలు ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు.