: రైతులకు 24 గంటలూ ఉచిత విద్యుత్... తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ కేసీఆర్ వరం!


తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రైతులకు కేసీఆర్ ఓ అద్భుతమైన వరాన్ని ప్రకటించనున్నారు. రైతులకు ప్రస్తుతం 8 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తుండగా, ఇకపై 24 గంటలూ ఉచిత విద్యుత్ ను ఇవ్వాలని ఆయన నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన, జూన్ 2న ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఆయనే స్వయంగా వెల్లడిస్తారని సమాచారం. రైతులకు ఉచిత విద్యుత్ కోసం అదనంగా మరిన్ని 400 కేవీ సబ్ స్టేషన్లను నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రైతులకు పూర్తి సమయం విద్యుత్ తో పాటు అన్ని వర్గాల ప్రజలకూ లబ్ది కలిగేలా పలు వరాలను కేసీఆర్ ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News