: 'సెక్సీ' నగరాల జాబితాలో వెనుకబడిన హైదరాబాదు: లజీవా సంస్థ సర్వే వెల్లడించిన ఆసక్తికర అంశాలు
ప్రపంచంలో టాప్ 100 సెక్సీ నగరాల జాబితాను అడల్ట్ యాప్ సేవలందిస్తున్న లజీవా సంస్థ 10 అంశాలపై సాధించిన స్కోరు ఆధారంగా ర్యాంకులు ఇవ్వగా, హైదరాబాద్ కు 89వ స్థానం లభించింది. ఈ జాబితాలో టాప్ లో పారిస్ నిలువగా, ఆపై రియో డిజెనీరో, లండన్, లాస్ ఏంజిల్స్, బెర్లిన్, న్యూయార్క్, సావ్ పాలో, లాస్ వెగాస్, లెబిజా, ఆమ్ స్టర్ డామ్ నిలిచాయి. ఇండియాకు సంబంధించిన ర్యాంకులు చూస్తే, శృంగారం, వీడియోలు చూడటం, టాయ్స్ వినియోగం, గర్భనిరోధకాల వినియోగం, స్త్రీ, పురుష సమానత్వం, అడల్ట్ సాహిత్యం తదితర అంశాలపై స్కోర్ల ఆధారంగా ముంబై తొలి స్థానంలో (వరల్డ్ ర్యాంకుల్లో 71) నిలువగా, ఆపై ఢిల్లీ (వరల్డ్ ర్యాంకుల్లో 78వ స్థానం), హైదరాబాద్ మూడవ స్థానంలో నిలిచాయి. కోల్ కతా, చెన్నై (వరల్డ్ ర్యాంకుల్లో 90, 91) టాప్ 5లో నిలిచాయి.
ఇక శృంగారంలో ఆసక్తిగా పాల్గొనే విషయంలో ముంబై పదికి 6.2 పాయింట్ల స్కోరుతో ముందు నిలువగా, హైదరాబాద్ 1.9 స్కోరుతో అట్టడుగున ఉంది. ఇక పోర్న్ వీడియోలు చూసే విషయంలో మిగతా నగరాలను వెనక్కు నెట్టి 8.7 పాయింట్ల స్కోరుతో ముందు నిలిచింది. ఆసక్తి లేకున్నా, తృప్తిని పొందుతున్నామని చెప్పిన వారిలో హైదరాబాదీలు ముందున్నారు. ముంబై వాసులు 'బాభీ' పేరుతో, ఢిల్లీలో 'వైఫ్' పేరుతో, హైదరాబాదీలు 'కాలేజ్ గర్ల్స్' పేరిట, కోల్ కతాలో 'బెంగాలీ', చెన్నై వాసులు 'తమిళ్' పదాలను వాడుతూ శృంగార వెబ్ సైట్ల కోసం సెర్చ్ చేస్తున్నట్టు లజీవా తెలిపింది.