: ముద్రగడకు నెలకోసారి కాపులు గుర్తొస్తారు.... ఆయన యాత్రలకు అనుమతివ్వం: చినరాజప్ప


ముద్రగడ పద్మనాభంకు కాపులు నెలకోసారి గుర్తుకొస్తారని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, ముద్రగడ అమరావతి వరకు చేస్తానంటున్న యాత్రకు అనుమతులు లేవని ఆయన చెప్పారు. కాపులకు ముద్రగడ ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాపులు ఓపిక పట్టాలని ఆయన సూచించారు. 30 ఏళ్ల పాటు ఎదురు చూసిన కాపులు నివేదిక వచ్చేవరకు ఎదురు చూడలేరా? అని ఆయన ప్రశ్నించారు. తామంతా సంయమనం పాటిస్తామని, పార్టీ అధినేతపై నమ్మకం ఉందని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్రాల సంబంధాలు బలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. వ్యక్తిగత వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం ఉండదని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News