: రాబోయే రోజుల్లో మోదీ హవా ఉండదు: కేసీఆర్


రాబోయే రోజుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హవా ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్ దేనని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. రానున్న ఎన్నికలపై తాజా సర్వేలు పలు అంశాలు వెల్లడించాయని, హైదరాబాదులోని ఆరు స్థానాల్లో ఎంఐఎం పార్టీ విజయం సాధిస్తుందని, మిగిలిన అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News