: ఉబర్, ఓలాలకు షాకిచ్చిన స్టేట్‌బ్యాంక్.. కార్ల రుణాలు రద్దు


ఉబర్, ఓలా ట్యాక్సీలకు రుణాలు ఇవ్వకూడదని భారతీయ స్టేట్ బ్యాంక్ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఆయా సంస్థలకు చెందిన డ్రైవర్ల నుంచి డిఫాల్టర్లు పెరిగిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రుణాలు ఎగ్గొట్టిన వారి నుంచి 300 కార్లను బ్యాంకు స్వాధీనం చేసుకుంది. క్యాబ్ సర్వీసులు విపరీతంగా పెరిగిపోవడం, ఆదాయం తక్కువ కావడంతో ఆ ప్రభావం రుణాలపై పడుతున్నట్టు గుర్తించిన ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

తాము ఓలా, ఉబెర్‌ల కోసం వాహనాలకు రుణాలు ఇవ్వడం నిలిపివేసినట్టు ఎస్‌బీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రుణాల రద్దు కొంతకాలం పాటు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత నిబంధనల్లో మార్పులు చేసి ముందుకొస్తామన్నారు. ఎస్‌బీఐ నిర్ణయంపై ఓలా, ఉబర్‌లు ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా, ఎస్‌బీఐ నిర్ణయం తక్షణం ముంబై, ఢిల్లీ, బెంగళూరులో అమల్లోకి రాగా, పశ్చిమబెంగాల్, ఒడిశా, హైదరాబాద్‌లో రుణాల పంపిణీపై ఎటువంటి ఆంక్షలు లేవు. కాగా, బెంగళూరులో ఓలా, ఉబెర్‌లకు రుణాలు ఇవ్వడాన్ని స్టేట్ బ్యాంక్ గతేడాదే రద్దు చేసింది.

  • Loading...

More Telugu News