: జమ్మూకాశ్మీర్ లో నక్కిన ఉగ్రవాదులు.. భారీ ఎన్ కౌంటర్ ప్రారంభం


జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లాలోని ట్రాల్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే అనుమానంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఈ రోజు ఉదయం భారీ ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. వారిని మట్టుబెట్టేందుకు ఆ ప్రాంతాన్ని సైన్యం చుట్టుముట్టింది. ఉగ్రవాదుల నుంచి కాల్పులు ప్రారంభమవడంతో సైన్యం దీటుగా సమాధానమిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. కాగా, జమ్మూకాశ్మీర్ లోని రాంపూర్ ప్రాంతంలో చొరబాటుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. రాంపూర్ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News