: యోగిపై ప్రశంసలు కురిపించిన అమిత్ షా.. సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారని కితాబు
ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. సమస్యల పరిష్కారంలో యోగి ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందని కితాబిచ్చారు. జెవార్ గ్యాంగ్ రేప్, మధుర, షహరాన్‌పూర్ ఘటనల్లో తక్షణం స్పందించారని పేర్కొన్నారు. యోగి ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ చక్కగా పనిచేస్తోందని, కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు.
ఎన్‌డీఏ ప్రభుత్వ మూడేళ్ల పాలనపై అమిత్ షా మాట్లాడుతూ గత 70 ఏళ్లలో సాధించలేని వాటిని తమ ప్రభుత్వం కేవలం మూడేళ్లలోనే సాధించిందన్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రానున్నట్టు వస్తున్న వార్తలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు షా బదులిస్తూ.. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటే తాము ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. రజనీ రాజకీయాల్లోకి రావాలని మాత్రమే తాను చెబుతున్నాను తప్ప, బీజేపీలో చేరాలని మాత్రం తాను చెప్పడం లేదని షా నొక్కి వక్కాణించారు.