: మహిళల బ్యాగ్ లో కారం పొట్లం, కత్తి తప్పనిసరిగా వుండాలి!: నన్నపనేని రాజకుమారి
మహిళల రక్షణ కోసం వారి బ్యాగ్ లో కారం పొట్లం, కత్తి తప్పనిసరిగా ఉండాలని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ లో ఆమె మాట్లాడుతూ, మహిళల రక్షణ కోసం చట్టాల్లో మార్పులు తీసుకురావాలని, వారి స్వీయరక్షణకు మారణాయుధాలు ధరించేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని, నిర్భయ లాంటి చట్టాలు చేసినా సమాజంలో మార్పు రావడం లేదని అన్నారు. మహిళలను వేధిస్తే రోకలి బండతో దాడి చేయాలని, టీవీ సీరియల్స్, కామెడి షోలు, సినిమాలలో మహిళలను విలన్లుగా చిత్రీకరించడం మానుకోవాలని ఆమె హెచ్చరించారు.