: మహానాడుకు సర్వం సిద్ధం.. సభా ప్రాంగణంలో 70 అడుగుల లోకేశ్ కటౌట్


విశాఖపట్నంలో రేపు ఉదయం 9.25 గంటలకు టీడీపీ మహానాడు ప్రారంభం కానుంది. మహానాడు ప్రాంగణంలో 70 అడుగుల‌ పొడవుతో టీడీపీ యువనేత, ఏపీ మంత్రి నారా లోకేశ్‌ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సారి మహానాడులో 24 తీర్మానాలను ఆమోదించి వాటిపై ప్ర‌సంగించ‌నున్నారు. వాటిల్లో ఏపీకి సంబంధించి 18, తెలంగాణకు సంబంధించిన‌వి 6 తీర్మానాలు వుంటాయి. ఏపీ, తెలంగాణల నుంచి మహానాడుకి సుమారు 26 వేల మంది హాజ‌ర‌వుతార‌ని అంచ‌నా. ఇక వేదికపై 250 మంది నేతలు కూర్చునేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. మ‌హానాడు వేదికకు ఒక వైపు హైటెక్ సిటీ, రెండో వైపు పోలవరం నమూనాలను ఏర్పాటు చేశారు.                        

  • Loading...

More Telugu News