: జేసీబీ నడిపిన డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి
తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఈ రోజు జేసీబీ నడిపి, సాధారణ కూలీగా మారారు. మెదక్ పట్టణంలోని నాయకుని చెరువులో మిషన్ కాకతీయ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీబీ నడిపి పనులకు శ్రీకారం చుట్టిన ఆమె, సాధారణ కూలీగా మారారు. పలుగు, పార చేతబట్టి మట్టి తట్టను నెత్తిన పెట్టుకుని పనులు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు పట్ణణంలోని బంగ్లా చెరువు, మల్లం చెరువులను డిప్యూటీ స్పీకర్ పరిశీలించారు. అనంతరం, కలెక్టరేట్ లో హరితహారంపై సమీక్ష నిర్వహించారు.