: అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎన్డీయే ఎంపిక చేస్తే ఓకే!: రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై మమతా బెనర్జీ
కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశం ముగిసింది. అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరనే దానిపై సమావేశంలో చర్చించలేదని చెప్పారు. అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించాలని తాము నిర్ణయించినట్టు తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎన్డీయే ఎంపిక చేస్తే.... వారికి తాము కూడా మద్దతిస్తామని చెప్పారు. ఈ సమావేశానికి దేవేగౌడ, శరద్ పవార్, నితీష్ కుమార్, శరద్ యాదవ్, సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డి, మమతా బెనర్జీ, ఒమర్ అబ్దుల్లా, కనిమొళి, మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.