: రజనీ కాంత్ పై కమల హాసన్ సంచలన వ్యాఖ్యలు


తమిళనాడులో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు బాలచందర్ శిష్యులుగా, స్టార్ హీరోలుగా పేరుతెచ్చుకున్న రజనీకాంత్, కమల హాసన్ లకు పేరుంది. వీరిద్దరూ ప్రత్యక్షంగా ఒకరిని మరొకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు లేవనే చెప్పాలి. అయితే తాజాగా దిగ్గజ నటుడు కమల హాసన్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేగుతోంది. రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై చెన్నైలో కమల హాసన్ మాట్లాడుతూ, రజనీకాంత్ కు కెమెరాల ముందు కనపడాలనే ఆరాటం ఎక్కువ అన్నారు. అందుకే ఇలా హడావుడి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కెమెరాలు ఎక్కడుంటే అక్కడ రజనీకాంత్ ప్రత్యక్షమవుతారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు తమిళనాట కలకలం రేపుతున్నాయి. 

  • Loading...

More Telugu News