: బాంబు పేలుడులో గ్రీస్ మాజీ ప్రధానికి గాయాలు
గ్రీస్ మాజీ ప్రధాని లుకాస్ పపాడెమొస్ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. 2011 నుంచి 2012 వరకు గ్రీస్ ప్రధానిగా పని చేసిన లుకాస్ పపాడెమొస్ ఎథెన్స్ లో ప్రయాణిస్తుండగా, అప్పటికే దుండగులు ఆయన కారులో పెట్టిన లెబర్ బాంబు ఒక్కసారిగా పేలింది. ఈ బాంబు పేలుడులో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయనకు ప్రాణాపాయం తప్పిందని చెబుతున్న వైద్యులు, ఆయన శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.