: అప్పట్లో ఓసారి ఆత్మహత్య చేసుకుందామనుకున్నా!: సినీ నటుడు చలపతిరావు


తాజాగా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన ప్రముఖ సినీ నటుడు చలపతిరావు ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితానికి చెందిన పలు విషయాలు చెప్పుకొచ్చారు. గతంలో ఓ సందర్భంలో తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని, అయితే, తన పిల్లలు దిక్కులేని వాళ్లు అయిపోతారని భావించి ఆ ప్రయత్నాలను విరమించుకున్నానని చెప్పారు.

సినీ రంగంలోకి ప్రవేశించకముందే, తాను ప్రేమ వివాహం చేసుకున్నానని, అయితే, తనకు 27 ఏళ్ల వయసు వచ్చేసరికే తన భార్య కన్నుమూసిందని చెప్పారు. అప్పటికే తనకు ముగ్గురు పిల్లలు పుట్టారని అన్నారు. భార్య చనిపోవడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన వచ్చిందని, అయితే, తన పిల్లలు కళ్లెదుటే ఉండటంతో ఆ ఆలోచనను పక్కన పెట్టానని నాటి విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

  • Loading...

More Telugu News