: నిబంధనలు ఉల్లంఘిస్తే బహిష్కరణే!: అభిమానుల‌కు ర‌జ‌నీకాంత్ వార్నింగ్


సౌతిండియా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌న్న వార్త‌లు మ‌రోసారి హ‌ల్‌చ‌ల్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయ‌నకు మ‌ద్ద‌తుగా కొంద‌రు ప్ర‌ముఖులు వ్యాఖ్యానిస్తుండ‌గా, మ‌రికొంద‌రు ర‌జ‌నీకి వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నారు. అయితే, ఇటీవ‌ల‌ చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో త‌న‌ అభిమానులు ఎవరూ అమర్యాదకరంగా ప్రవర్తించ‌కూడ‌ద‌ని సూచిస్తూ ఓ లేఖ విడుద‌ల చేశారు.

ఒక వేళ‌ ఫ్యాన్స్‌ క్లబ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై బహిష్కరణ వేటు వేస్తామ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాజాగా చెన్నై సహా పలు ప్రాంతాల్లో ర‌జ‌నీ రాజ‌కీయ‌రంగ ప్ర‌వేశంపై ఎన్నో పోస్టర్లు వెలిశాయి. దీంతో అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోతున్నాయి. ఈ క్ర‌మంలో వారు ఎటువంటి అత్యుత్సాహం ప్రదర్శించ‌కూడ‌ద‌ని ర‌జ‌నీ సూచించారు. కాగా, కొన్ని అభిమాన సంఘాలు రజనీ రాజకీయాల్లోకి రావద్దంటూ కూడా ఇటీవ‌లే నిర‌స‌న‌లు తెలిపి, ఆయ‌న‌ దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన విష‌యం తెలిసిందే.                

  • Loading...

More Telugu News