: చైనాలో విడుదలకు సిద్ధమైన ‘బాహుబలి 2’: తరణ్ ఆదర్శ్


భారత్‌లోనే కాక ఓవర్‌సీస్‌లోనూ స‌త్తా చాటుతున్న ‘బాహుబ‌లి-2’ సినిమా భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో ఉన్న రికార్డుల‌న్నింటినీ బ‌ద్ద‌లు కొడుతూ ఇంకా దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. అమెరికాలోనూ ఈ సినిమా ఊహించ‌ని స్థాయిలో కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. ఇక బాహుబ‌లి-2 చైనాలోనూ విడుద‌ల కావ‌డానికి సిద్ధ‌మైంద‌ని ప్ర‌ముఖ‌ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్ తెలిపాడు. ఏ తేదీన, ఎన్ని థియేట‌ర్ల‌లో ఈ సినిమా విడుద‌ల కాబోతుంద‌న్న విష‌యం తెలియాల్సి ఉంది. బాలీవుడ్ సినిమా ‘దంగల్‌’ ఇటీవ‌లే చైనాలో విడుద‌లై భారీగా క‌లెక్ష‌న్లు సాధిస్తోంది. ఆ సినిమాను మొత్తం 9000 స్క్రీన్లలో విడుదల చేశారు.                            
 






             

  • Loading...

More Telugu News