: టీమిండియాలో రైనా, కోహ్లీలే మంచి సింగర్లని అశ్విన్ అంటే... రైనా ఏమన్నాడో చూడండి!
టీమిండియాలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా మంచి గాయకులు, డ్యాన్సర్లు అని ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. ముంబైలో నిర్వహించిన సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్-2017 ప్రదానోత్సవంలో అశ్విన్ ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, కోహ్లీ, రైనాలు మంచి సింగర్లు మరియు డాన్సర్లని చెప్పాడు. అదే ప్రశ్నకు రైనా సమాధానమిస్తూ, తనకంటే కోహ్లీ మంచి డాన్సర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాడు. కేవలం డాన్స్ మాత్రమే కాదని, తనకంటే మెరుగ్గా పాటలు కూడా పాడుతాడని కోహ్లీకి కితాబిచ్చాడు. కాగా, గతంలో బంగ్లాదేశ్ లో కోహ్లీ గొంతు సవరించగా, యువీ పెళ్లి వేడుకలో తన ప్రేయసితో కలిసి డాన్స్ చేశాడు. కాగా, ‘మీరూథియా గ్యాంగ్ స్టర్స్’ అనే బాలీవుడ్ సినిమాలో రైనా ‘తు మిలి సబ్ మిలా’ పాటను పాడాడు. రైనా పాట, కోహ్లీ డాన్స్ ను చూడండి.