: అబ్బాయిలకు, అమ్మాయిలకు ఆలోచనల్లో తేడా అదే!: ఇలియానా


ఇన్ స్టాగ్రామ్ లో అబ్బాయిల గురించి హీరోయిన్ ఇలియానా చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అబ్బాయిలు కేవలం శృంగారం గురించే ఆలోచిస్తారని.... ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి వారికి ఈ ఆలోచనలే వస్తాయని పోస్ట్ చేసింది. అమ్మాయిలైతే ఆహారం, పాదరక్షలు, దుస్తుల గురించి ఆలోచిస్తారని చెప్పింది. జిమ్ కు వెళ్లాలా, నా ఫొటోను అతను ఎందుకు లైక్ చేయలేదు, పెదవులకు ఇంజెక్షన్ చేయించుకోవాలా, నా ఇంటిపేరు చివరి వరకు ఉంటుందా, నా కనుబొమ్మలు బాగున్నాయా, బాగాలేని ఈ గోళ్లను వదిలించుకోవడం ఎలా, కొంచెం ముందుగానే వైన్ సేవిస్తున్నానా? తదితర అంశాల గురించి అమ్మాయిలు ప్రతి ఐదు నిమిషాలకొకసారి ఆలోచిస్తారని చెప్పింది. అందుకే అమ్మాయిలు చాలా క్రేజ్ గా ఉంటారని తెలిపింది.

  • Loading...

More Telugu News