: కడప జిల్లాలో దారుణం... పట్టపగలు, నడిరోడ్డు మీద అత్యంత పాశవికంగా నరికేశారు!
కడప జిల్లా పొద్దుటూరులో అత్యంత దారుణం చోటుచేసుకుంది. పొద్దుటూరులో కోర్టుకు కూతవేటు దూరంలో మారుతీ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిని దారుణంగా నరికి చంపిన ఘటన పెను కలకలం రేపుతోంది. పొద్దుటూరుకు చెందిన మారుతీ ప్రసాద్ రెడ్డి కుటుంబంలోని మహిళతో అక్రమ సంబంధం విషయంలో నలుగురు వ్యక్తులతో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు వర్గాలు కోర్టు వాయిదాలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో కోర్టు వాయిదా కోసం మారుతీ ప్రసాద్ రెడ్డి వస్తున్న సమయంలో నలుగురు ప్రత్యర్థులు అతనిని అడ్డుకుని ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో ఆ నలుగురూ మారుతీ ప్రసాద్ రెడ్డిని కత్తులతో పొడిచారు. వారి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేసిన మారుతీ ప్రసాద్ రెడ్డిని వెంబడించి, నడి రోడ్డు మీద పట్టపగలు, పది గంటల ప్రాంతంలో అత్యంత పాశవికంగా...గొడ్డును చంపినట్టు అందరూ చూస్తుండగా నరికి చంపారు.