: విస్తుపోయే నిజం.. ఒక్కో రన్ కు ఏయే క్రికెటర్ ఎన్ని లక్షలు సంపాదించాడంటే?


ఐపీఎల్ లో స్టార్ క్రికెటర్లందరూ భారీ ధరకు అమ్ముడుబోయిన సంగతి తెలిసిందే. కొంత మంది స్టార్లు తాము తీసుకున్న డబ్బుకు న్యాయం చేకూర్చారు. మరికొందరు పెద్దగా ప్రదర్శన చేయకపోయినా... కోట్లు వెనకేసుకున్నారు. విరాట్ కోహ్లీ, ధోనీలు ఈ సీజన్ లో పెద్దగా రాణించలేదు. గౌతం గంభీర్, శిఖర్ ధావన్ లాంటి వారు మెరుగైన ప్రదర్శన చేశారు. ఈ నేపథ్యంలో వేలంపాటలో క్రికెటర్లు అమ్ముడుబోయిన మొత్తానికి, వారు చేసిన ఒక్కో పరుగుకు ఎంత సంపాదించారనే విషయంపై బిజినెస్ టుడే ఓ లెక్కకట్టింది. ఆ వివరాలేంటో చూద్దాం.

ఆటగాడుఅమ్ముడుబోయిన మొత్తం (కోట్లలో)సీజన్ లో చేసిన పరుగులుఒక్కో రన్ కు సంపాదించింది
కోహ్లీ153054,87,012
ధోనీ12.5 2904,31,034
బెన్ స్టోక్స్14.5 3164,58,860
డీవిలియర్స్9.5 2194,39,814
గంభీర్104982,00,803
సురేష్ రైనా9.5 4422,14,932
శిఖర్ ధావన్12.5 4792,60,960

  • Loading...

More Telugu News