: యుద్ధానికి దిగేవేళ అనుమతుల కోసం ఎదురుచూడొద్దు: సైన్యానికి జైట్లీ సూచన


ముష్కర మూకతో యుద్ధానికి దిగాల్సి వచ్చిన వేళ, స్వీయ నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేయాలే తప్ప, ఏం చేయాలన్న విషయమై పై నుంచి ఆదేశాలు వచ్చేంతవరకూ వేచి చూడవద్దని సైన్యానికి రక్షణమంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. కాశ్మీర్ లో ఎన్నికల వేళ, ఓ వ్యక్తిని జీపు ముందు కట్టి తమకు రక్షణ కవచంగా చేసుకుని పోలీసులు అక్కడి నుంచి బయటపడటాన్ని ఆయన సమర్థించారు.

ఇది తెలివైన చర్యగా అభివర్ణించిన ఆయన, "వార్ జోన్ లలో ఆర్మీ అధికారులు పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఇస్తున్నాం. సైన్యానికి ఆదేశాలు సైనికాధికారుల నుంచి అందుతాయే తప్ప ప్రజా ప్రతినిధుల నుంచి కాదు. ఏదైనా చర్య తీసుకునే ముందు అక్కడి పరిస్థితిని చూడండి. ఏ పార్లమెంటు సభ్యుడినీ అడగాల్సిన అవసరం లేదు" అని అన్నారు. కాగా, గత నెల 9వ తేదీన మేజర్ గగోయ్, తన జీపుకు ఫరూక్ అహ్మద్ దార్ అనే యువకుడిని కట్టి, అక్కడి నుంచి బయటపడిన సంగతి తీవ్ర విమర్శలకు దారితీయగా, ఆయన చేసిన దాంట్లో తప్పులేదని సైనికాధికారులు తేల్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News