: ఏలూరులో విషాదం.. ఒకే ఇంట్లో నలుగురి ఆత్మహత్య!
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. ఏలూరు బీడీకాలనీలో నివాసముండే పద్మావతి (64), సంతోషి రూప (37), సాయి సిద్దార్థ (9), సాయి రామ్ (5) ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి ఇంటి నుంచి దర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి తలుపులు తీసి లోపలికి వెళ్లి చూశారు. దీంతో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు గుర్తించారు. అయితే వారి ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.