: ఈసీ సవాలు నుంచి కాంగ్రెస్ ఔట్.. ఈవీఎం ట్యాంపరింగ్ చాలెంజ్‌పై వెనకడుగు!


ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) ట్యాంపరింగ్‌పై ఎలక్షన్ కమిషన్ విసిరిన సవాలు నుంచి కాంగ్రెస్ తప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ చాలెంజ్‌లో పాల్గొనరాదని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలక్షన్ కమిషన్‌ నుంచి సోమవారం చాలెంజ్‌కు సంబంధించిన నోటీసు అందుకున్న కాంగ్రెస్ దానిపై ఇప్పటి వరకు స్పందించలేదు. అధిష్ఠానం ఆదేశాల మేరకు ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు. ‘‘ఈవీఎంలను ప్రవేశపెట్టిందే మేము. అటువంటి మేం ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందరిలా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించలేం’’ అని కాంగ్రెస్ ఆఫీస్ బేరర్ ఒకరు చెప్పుకొచ్చారు. దీంతో ఈసీ చాలెంజ్‌లో కాంగ్రెస్‌కు  పాల్గొనే ఉద్దేశం లేదని తేలిపోయింది.

  • Loading...

More Telugu News