: నాలుగు దేశాల పర్యటనకు బయలుదేరనున్న మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనలకు బయలుదేరనున్నారు. ఈ నెల 29 నుంచి వచ్చేనెల 3 వరకు ఆయన నాలుగు దేశాల్లో పర్యటిస్తారు. జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్‌లలో ఆయన ఆయా దేశాల అధ్యక్షులు, అధికారులతో సమావేశం అవుతారు. ఈ నెల 29న ఆయన జర్మన్ ఛాన్సలర్ ఎంజెలా మార్కెల్‌తో భేటీ అవుతారు. జూన్ 3న ఫ్రెంచ్ కొత్త అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రోన్‌తో భేటీ అవుతారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సత్సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మోదీ తన పర్యటన జరపనున్నారు.