: నారాయణరెడ్డి హత్య కేసు.. 12 మంది నిందితుల అరెస్టు
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు హత్య కేసులో 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన వేటకొడవళ్లు, ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్టు కర్నూలు రేంజ్ డీఐజీ తెలిపారు. హత్య కేసు నిందితులను డోన్ పోలీసులు అరెస్టు చేశారని, డోన్ డీఎస్పీ ఆధ్వర్యంలో 3 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. విచారణ ద్వారా కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని అన్నారు.