: భారత భూభాగంలో యుద్ధవిమానాలతో చక్కర్లు... పాకిస్థాన్ మరో దుందుడుకు చర్య?
పాకిస్థాన్ మరో దుందుడుకు చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇటీవలే రెండు రోజులు నౌషెరాకు సమీపంలో ఉన్న పాకిస్థాన్ స్థావరాలపై భారత ఆర్మీ దాడులు చేసిందని, పలు శిబిరాలను ధ్వంసం చేసిందని నిన్న ఇండియన్ ఆర్మీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్.. భారత్-పాక్ సరిహద్దు సియాచిన్ గ్లేషియర్ సమీపంలో ఈ రోజు ఉదయం తమ యుద్ధవిమానాలతో చక్కర్లు కొట్టింది. అంతేకాదు, పాకిస్థాన్ మీడియా పేర్కొన్న ఓ కథనం ప్రకారం ఆ ప్రాంతంలో పాక్‌కు చెందిన అన్ని ఆర్మీ బేస్‌లను నిర్వహణలోకి తీసుకొచ్చారు. వాటిని పాక్ ఆర్మీ చీఫ్ మార్షల్ సోహైల్ అమన్ పర్యవేక్షించారు. మరోవైపు పాకిస్థాన్ మీడియా కథనాలను భారత్ కొట్టిపారేసింది. సియాచిన్ ప్రాంతంలోని భారత భూభాగంలో పాక్‌కు చెందిన ఎలాంటి యుద్ధవిమానాలు కనిపించలేదని పేర్కొంటోంది.