: ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం
ప్రధాని నరేంద్ర మోదీకి కాపు సామాజికవర్గ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. వీఐపీ కల్చర్ ను రూపుమాపే క్రమంలో ప్రముఖుల వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. ఎర్రబుగ్గలు తొలగించిన వారికి పైలట్, ఎస్కార్ట్ వాహనాలను కూడా తొలగించాలని మోదీకి ఆయన విన్నవించారు.