: రజనీకాంత్ పై తీవ్ర విమర్శలు చేసిన మరో కోలీవుడ్ నటుడు సీమాన్
తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ పై మరో సినీ నటుడు, దర్శకుడు, నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ తీవ్ర విమర్శలు చేశారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, తమిళనాడులో పుట్టినవారికి మాత్రమే తమిళనాడును పాలించే అర్హత ఉందని అన్నారు. ఎవరు తమిళుడో .. ఎవరు తమిళుడు కాదో అందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. అలా తమిళనాడును పాలించే హక్కు కేవలం శరత్ కుమార్, కార్తీక్ లకు మాత్రమే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కావేరీ నది నుంచి చుక్క నీటిని కర్ణాటక ఇవ్వలేదని ఆయన చెప్పారు. అలాంటప్పుడు కర్ణాటక నుంచి వచ్చిన వ్యక్తిని సీఎంగా తాము ఎలా అంగీకరిస్తామని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో తమ పోరాటం తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.