: 30,000 మందికి పైగా భారతీయులు అక్రమంగా ఉన్నారు: 'అమెరికా కాంగ్రెస్'కు నివేదిక
గతేడాది అమెరికాలో 14 లక్షల మంది భారతీయులు అడుగుపెట్టగా, అందులో 30,000 మంది గడువుకు మించి అమెరికాలో ఉన్నారని ఒక నివేదిక చెబుతోంది. అమెరికాలో ఉంటున్న విదేశీయుల గణాంకాలపై అమెరికా అంతర్గత వ్యవహారాల శాఖ ఒక నివేదికను అమెరికా కాంగ్రెస్ కు సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం 2016లో భారత్ నుంచి వ్యాపార, పర్యాటక, విద్యార్థి వీసాలపై అమెరికాలో సుమారు 14 లక్షల మంది కాలుమోపారని, వారిలో 30,000 మందికి అమెరికా ఇచ్చిన గడువు ముగిసిపోయిందని, అయితే వారు ఇంకా దేశం వీడలేదని, అమెరికాలోనే అక్రమంగా ఉంటున్నారని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. అమెరికా కాంగ్రెస్ కు సమర్పించిన నివేదికలో వలసేతర సందర్శకుల్లో 96 శాతం మందికి సంబంధించిన గణాంకాలను పొందుపరిచింది.