: కోహ్లీకి జీతం పెంచండి... అంటూ రెండు డిమాండ్లు చేస్తున్న కోచ్ కుంబ్లే
బీసీసీఐ పెంచిన ఆటగాళ్ల జీతాలు సరిపోవని గతంలో స్పష్టం చేసిన టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే... తాజాగా బీసీసీఐ, బోర్డు పాలకుల ముందు రెండు డిమాండ్లు పెట్టాడు. టీమిండియా కెప్టెన్ కు ఇతర ఆటగాళ్ల కంటే ఎక్కువ జీతం చెల్లించాలని డిమాండ్ చేశాడు. జట్టు ప్రదర్శనకు కెప్టెన్ జవాబుదారీ కనుక అతనికి ఇతర ఆటగాళ్ల కంటే 25 శాతం జీతం ఎక్కువ ఉండాలని కుంబ్లే డిమాండ్ చేస్తున్నాడు.
అంతే కాకుండా ఆటగాళ్ల ఫామ్, ఫిట్ నెస్, స్వభావాన్ని దగ్గర్నుంచి గమనించేది కూడా కెప్టెనే... అలాంటప్పుడు అతనికి ఆ మాత్రం అదనంగా చెల్లించడం న్యాయమేనని కుంబ్లే వాదిస్తున్నాడు. అలాగే టీమిండియా కోచ్ కు సెలక్షన్ కమిటీలో స్థానం కల్పించాలని సూచించాడు. కోచ్ కు సెలక్షన్ కమిటీలో స్థానం కల్పించడం ద్వారా జట్టు అవసరాలు ఏంటి? వనరులు ఏవి? ఎలాంటి ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంటుంది? వంటి విషయాలపై మరింత స్పష్టత ఉంటుందని కుంబ్లే వాదిస్తున్నాడు.