: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది బీజేపీనే.. తేల్చి చెప్పిన సర్వే
ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే బీజేపీ విజయ దుందుభి మోగించి మరోమారు అధికారంలోకి వస్తుందని ఓ జాతీయ పత్రిక దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో వెల్లడైంది. 2014 నాటి ఎన్నికల ఫలితాల కంటే మెరుగైన ఫలితాలే వస్తాయని పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 84 శాతం మంది బీజేపీకి ఓటేశారు. ఈరోజు కనుక ఎన్నికలు జరిగితే 2014 ఎన్నికల నాటి ఫలితాలు, లేదంటే అంతకంటే మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. 61 శాతం మంది మాత్రం 2014 ఎన్నికలంత ఘన విజయం లభించకపోవచ్చని అభిప్రాయపడ్డారు. 23 శాతం మంది మాత్రం 2014 ఎన్నికల నాటి ఫలితాలే పునరావృతమవుతాయని పేర్కొన్నారు. తృణమూల్, సీపీఐ మద్దతుదారులుగా భావిస్తున్న వారిలో 74 శాతం మంది కూడా బీజేపీనే గెలుస్తుందని చెప్పడం విశేషం.