: చలపతిరావు మాట్లాడింది ముమ్మాటికీ తప్పే!: యాంకర్ శ్రీముఖి
మహిళలపై సినీ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పని తాను చెబుతానని యాంకర్ శ్రీముఖి అన్నారు. ఈ విషయమై ఓ న్యూస్ ఛానెల్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, అంత సీనియర్ యాక్టర్ ఆ విధంగా మాట్లాడారంటే నమ్మలేకపోతున్నానని అన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా చలపతిరావు ఏం మాట్లాడిందీ తనకు వినపడలేదని యాంకర్ రవి చెబుతున్నాడని, ఆ విషయాన్ని ఎంత వరకు నమ్మవచ్చని శ్రీముఖిని ప్రశ్నించగా..‘ఆడియో లాంచ్ లైవ్ టెలీకాస్ట్ అవుతుంది కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. చాలా ఆడియో లాంచ్ కార్యక్రమాల్లో పాల్గొన్న నా అనుభవం ప్రకారం, టెక్నికల్ సమస్యలు ఉంటాయి. ఒక్కోసారి, మేము ఏం మాట్లాడుతున్నామో మాకే అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితిని నేను కూడా ఫేస్ చేశాను’ అని చెప్పుకొచ్చారు.