: దేశంలోనే తొలిసారిగా ఐటీ ఎంప్లాయీస్ కు ఫోరం!


దేశంలోని పలు ప్రముఖ ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న నేపథ్యంలో ఐటీ ఎంప్లాయీస్ ఓ ఫోరంగా ఏర్పడనున్నారు. టెక్కీలు ఫోరంగా ఏర్పడనుండటం దేశంలో ఇదే తొలిసారి. ‘ది ఫోరమ్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ (ఎఫ్ఐటీఈ) పేరిట రిజిస్టర్ కానున్నట్టు ఫోరం వైస్ ప్రెసిడెంట్ వసుమతి చెప్పారు. వచ్చే ఐదు నెలల్లో ఈ ఫోరం ఏర్పాటు కానుందని, మేజర్ ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను అక్రమంగా తీసివేస్తున్న కారణంగానే ఈ ఫోరం ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అన్నారు. ఈ ఫోరంలో వెయ్యిమంది ఆన్ లైన్ సభ్యులుగా ఉండగా, వంద మంది యాక్టివ్ మెంబర్స్ గా ఉన్నట్టు చెప్పారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణె, ముంబయి, కోచీ, ఢిల్లీ లలో 9 చాప్టర్స్ ను ప్రారంభించామని వసుమతి చెప్పారు.

  • Loading...

More Telugu News