: గుంటూరులో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం!


గుంటూరులో మధ్యాహ్నం పూట భానుడు నిప్పులు కురిపిస్తోంటే.. మరోవైపు సాయంత్రం పూట వరుణుడు విరుచుకుపడుతున్నాడు. మధ్యాహ్నం అత్యధికంగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్న గుంటూరులో ఈ రోజు సాయంత్రం కూడా భారీ వ‌ర్షం పడింది. ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం ధాటికి లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యమై వ‌ర్షాకాలాన్ని త‌ల‌పించాయి. మ‌రోవైపు హిందూ క‌ళాశాల సెంట‌ర్‌లో రోడ్డుపై ప్ర‌యాణికుల‌తో వెళుతున్న‌ కారుపై ఓ భారీ హోర్డింగ్ కుప్ప‌కూలింది. కారు స్వ‌ల్పంగా దెబ్బ‌తిన‌గా కారులో ప్ర‌యాణిస్తోన్న న‌లుగురు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు.                        

  • Loading...

More Telugu News