: పీజీ కోర్సుల్లో ప్రవేశానికి.. ఓయూ సెట్ షెడ్యూల్ విడుదల!
ఉస్మానియా యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఓయూసెట్)-2017 షెడ్యూల్ ఈ రోజు విడుదలైంది. తమ వర్సిటీ పరిధిలోని కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఓయూ ఈ టెస్ట్ నిర్వహిస్తుంది. జూన్ 5 నుంచి 13 వరకు ఓయూ సెట్ నిర్వహిస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ పేర్కొంది. వచ్చేనెల 1 సాయంత్రం 5 గంటల నుంచి వెబ్సైట్లో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఆయా కోర్సుల పరీక్షల తేదీలు, మరిన్ని వివరాలు http://www.osmania.ac.in/ లో చూడవచ్చు.