: ప్రధానికి కానుకగా ప్లాస్టిక్ వేస్ట్ తో చేసిన బుట్ట... మహిళ ఆలోచన అద్భుతమంటూ మోదీ ప్రశంస!


బీహార్ లోని సమస్థిపుర్ కు చెందిన గృహిణి, నిరక్షరాస్యురాలు అయిన ఆమె పేరు గీత. వయసు యాభై ఏళ్లు. ఆమె భర్త రామచంద్ర ఝా ఓ చిన్న రైతు. అయితే, ప్లాస్టిక్ వేస్ట్ ను ఉపయోగించి అందమైన వస్తువులను తయారు చేయడం గీతకు అలవాటు. ఈ అలవాటు కారణంగానే ఓ నెల క్రితం ప్లాస్టిక్ వేస్ట్ తో తయారు చేసిన బుట్టను ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)కు పంపింది. తాను పంపిన గిఫ్ట్ పై ప్రధాని మోదీ పంపే రిప్లై కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఆ శుభ సందేశం ఈరోజు అందనే అందింది. ఆమె పంపిన బహుమతిపై మోదీ ప్రశంసలు కురిపించారు.

‘వేస్ట్ ప్లాస్టిక్ ను ఉపయోగించి అందమైన వస్తువులను తయారు చేయాలనే ఆలోచన అద్భుతం. ఇది ‘స్వచ్ఛభారత్’ ప్రచారానికి మాత్రమే ఉపయోగకరం కాదు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి విస్తృతమైన శక్తినిస్తుంది’ అని ఆ లేఖలో మోదీ కొనియాడారు. ఈ సందర్భంగా గీత, ఆమె భర్త మాట్లాడుతూ, ‘మోదీజీ రిప్లై చూసి మేం చాలా సంతోషపడ్డాం. ఏకంగా ప్రధానే మమ్మల్ని ప్రోత్సహించడం ఆనందంగా ఉంది. అయితే, వేస్ట్ ప్లాస్టిక్ తో చేసిన ఉత్పత్తులతో బిజినెస్ చేయాలంటే మా వద్ద సరిపడా డబ్బు లేదు. బహు:శ మాకు బ్యాంకు రుణం లభిస్తే, బిజినెస్ చేయగలుగుతాం’ అన్నారు. కాగా, గీత నిరక్షరాస్యురాలు కావడంతో ప్రధాని మోదీ రాసిన లేఖను ఆమెకు పలుసార్లు చదివి వినిపించడం గమనార్హం.

  • Loading...

More Telugu News