: నేనయితే అబ్బాయిలు విషపూరితమని చెబుతా: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యతో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ‘రారండోయ్ ..వేడుక చూద్దాం’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలోని ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అనే డైలాగ్‌పై స్పందించింది. తనను ఎవరైనా అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా? అని అడిగితే అబ్బాయిలు పాయిజనెస్ అని చెబుతానని సరదాగా చెప్పింది. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ధీమా వ్యక్తం చేసింది.
ఇప్పటి వరకు తాను ఏ సినిమాలోనూ కనిపించనటువంటి పాత్రంలో ఈ సినిమాలో కనపడుతున్నానని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. ఈ సినిమాలో తన పాత్రకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని చెప్పింది. తాను తెలుగు నేర్చుకుంటానని, తెలుగు సినిమాల వల్లే తాను ఎంతో గుర్తింపు తెచ్చుకున్నానని తెలిపింది. ఈ సినిమాలో ఓ ఇన్నోసెంట్ లవ్‌స్టోరీని చూస్తారని చెప్పింది.