: నా గుండె పగిలింది...ఐయామ్ సారీ: ఉగ్రదాడిపై పాప్ సింగర్ అరియానా గ్రాండే


ఇంగ్లండ్ లోని మెన్ ఎరీనాగా ముద్రపడిన మాంచెస్టర్ ఎరీనాలో ఉగ్రదాడి జరిగిన ఐదు గంటల తరువాత పాప్ సింగర్ అరియానా గ్రాండే స్పందించింది. 'నా గుండె పగిలింది...ఐయామ్ సారీ...ఏం చెప్పాలో మాటలు రావడం లేదు' అంటూ తన సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.




కాగా, మాంచెస్టర్ ఎరీనాలో అరియానా ప్రదర్శన ముగిసిన అనంతరం గేట్ వద్ద ఆత్మాహుతి దాడి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వేదిక కెపాసిటీ 18,000 కాగా, ఈ షోకు 21,000 మంది హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాది దాడికి పాల్పడడంతో 20 మంది మృత్యువాతపడగా, 56 మంది క్షతగాత్రులయ్యారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. బర్మింగ్‌ హామ్‌, డబ్లిన్‌ లో ఇప్పటికే ప్రదర్శనలు ఇచ్చిన అరియానా రేపు, ఎల్లుండి లండన్‌ లో ప్రదర్శనలు ఇవ్వాల్సివుంది. ఈలోపు మాంచెస్టర్‌ లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో తరువాతి షోలపై సందిగ్ధత నెలకొంది. 

  • Loading...

More Telugu News