: పత్తికొండ అసెంబ్లీ టికెట్ ఎవరికో క్లారిటీ ఇచ్చిన జగన్
2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లా పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ టికెట్ ఎవరికి ఇవ్వనున్నారనే విషయంపై ఆ పార్టీ అధినేత జగన్ క్లారిటీ ఇచ్చారు. పత్తికొండ నుంచి నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవి పోటీ చేస్తారని జగన్ చెప్పారు. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన నారాయణరెడ్డి హత్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిలే బాధ్యత వహించాలని అన్నారు. హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, నారాయణరెడ్డి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని... ఆయన కుటుంబసభ్యులకు పార్టీ అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు.