: ప్రకాశం పరిణామాలపై చంద్రబాబు సీరియస్... మధ్యాహ్నంలోగా వచ్చి కలవాలని గొట్టిపాటికి ఆదేశం
ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలపై సీరియస్ అయిన అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రకాశం జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో గొట్టిపాటి రవి, కరణం బలరాం వర్గీయుల మధ్య జరిగిన బాహాబాహీపై పార్టీ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించిన ఆయన, మధ్యాహ్నంలోగా వచ్చి తనను కలవాలని గొట్టిపాటి రవికుమార్ ను ఆదేశించారు. ఈ సమాచారాన్ని అందుకున్న వెంటనే గొట్టిపాటి ఒంగోలు నుంచి అమరావతికి బయలు దేరారని తెలుస్తోంది.