: గొట్టిపాటి చొక్కా చింపే ప్రయత్నం చేసిందెవరు?
ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవి వర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశ మందిరంలోకి వెళ్తున్న గొట్టిపాటి రవిని కరణం బలరాం అడ్డుకున్నారు. ఈ సమయంలో రెండు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సమయంలో మౌనంగానే లోపలికి వెళ్తున్న గొట్టిపాటి రవి చొక్కాను కరణం వర్గీయులు పట్టుకున్నారు. దీంతో ఆయన చొక్కా చినిగింది. అనంతరం వారి నుంచి విడిపించుకున్న గొట్టిపాటి రవి, సమావేశ మందిరంలోనికి వెళ్తూ వెనుదిరిగి చూడగా, కరణం వెంకటేష్ వేలు చూపిస్తూ బెదిరింపులకు దిగారు. ఆయన పక్కనున్న అనుచరుడు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అయితే మీడియా విజువల్స్ లో గొట్టిపాటి చొక్కాపట్టుకున్నదెవరో స్పష్టంగా తెలియడం లేదు.