: ఇజ్రాయిల్ టూర్ లో ట్రంప్ చేతిని విసురుగా నెట్టేసిన మెలానియా.. వీడియో వైరల్


సౌదీ అరేబియా టూర్ ముగిసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'ఎయిర్ ఫోర్స్ వన్'లో ఇజ్రాయిల్ బయల్దేరారు. ఇజ్రాయిల్ లో ట్రంప్ కు ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు దంపతులు స్వాగతం పలికారు. ఈ సమయంలో ట్రంప్ ముందుకు వచ్చి మెలానియాను పట్టించుకోకుండా వారితో వేగంగా నడిచారు. దీంతో కినుక వహించిన మెలానియా హైహీల్స్ తో రెండు అడుగులు వెనకబడింది. అయితే ఆమెను తొలుత పట్టించుకోని ట్రంప్... తర్వాత ఆమె కోసం తన చేతిని వెనక్కు చాచారు. అయితే ట్రంప్ పై ఆగ్రహంతో ఆయన చేతిని మెలానియా విసురుగా తొసేసింది. క్షణాల్లో జరిగిన ఈ సంఘటన మీడియా కంటబడింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో మీరు చూడండి.

  • Loading...

More Telugu News