: 'ఇండియా'కి తమ్ముడు పుట్టాడు... సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ కి పుత్రోదయం!
ఫీల్డ్ లో కళ్ళు చెదిరే ఫీల్డింగ్ తో ప్రత్యర్ధి గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ ఇప్పుడు ఒకేసారి రెండు రకాల ఆనందాలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఐపిఎల్ సీజన్-10లో తాను ఫీల్డింగ్ కోచ్ గా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు ఒక్క పరుగు తేడాతో విజయం అందుకోవడానికి తోడు అతని భార్య పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన జాంటీ... 'ఐపీఎల్ ప్రైజ్ కి ముందే ప్రైజ్ అందుకున్నాను...ముందుగా నిర్ణయించిన ప్రకారం...నా భార్య మెలానీ...ఆదివారం సాయంత్రం 6.20 నిమిషాలకి ముంబైలోని పేరున్న ఆసుపత్రిలో నాథన్ జాన్ అనే బాబుకి పూల్ బర్త్ విధానంలో జన్మనిచ్చింది' అంటూ ట్వీట్ చేశాడు. కొడుకు పుట్టిన ఆనందంతో పాటు, జట్టు గెలిచిన ఆనందాన్ని కూడా ఆస్వాదిస్తున్నానని జాంటీ రోడ్స్ తెలిపాడు. కాగా, ఇండియాపై ఉన్న ప్రేమతో 2013లో ముంబైలో జన్మించిన తన కుమార్తెకు 'ఇండియా రోడ్స్' అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు కొడుకుని కూడా ప్రణాళిక ప్రకారం ఇండియాలో జన్మనిచ్చేలా చేశాడు. ఇండియా, నాథన్ ను చూసి సంబరపడిపోతోంది.
The prize before the prize @mipaltan? Nathan John "plunged" into the world at 6:20pm on IPL final #poolbirth #earthmother #incredibleindia pic.twitter.com/UiUCMt4fih
— Jonty Rhodes (@JontyRhodes8) May 21, 2017