: పీకల దాకా తాగి క్లబ్ లో రచ్చరచ్చ చేసిన బ్రిటిష్ నటి అన్నా రీస్!
పీకల్దాక తాగి బిల్లు కట్టేందుకు క్లబ్ లో రచ్చరచ్చ చేసిన బ్రిటిష్ నటిని బ్యాంకాక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే...బ్యాంకాక్ లోని ఓ నైట్ క్లబ్ కు అన్నా రీస్ వెళ్లింది. అక్కడ పీకల్దాకా మద్యం తాగింది. బిల్లు చెల్లించాలని నైట్ క్లబ్ సిబ్బంది అడగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె, అక్కడి సామాన్లను విసిరికొట్టింది. బిల్లు చెల్లించకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. దీంతో నైట్ క్లబ్ సిబ్బంది ఫిర్యాదు మేరకు రంగప్రవేశం చేసిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సొంత పూచీకత్తుపై ఆమెను ఈ రోజు తెల్లవారు జామున విడిచిపెట్టారు.
కాగా, రెండేళ్ల క్రితం ఈమె నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ పోలీసు అధికారిని ఢీకొట్టిన కేసులో అరెస్టు అయింది. తాజా ఘటనపై స్పందిస్తూ, తన కుటుంబ సమస్యల వల్ల మద్యం ఎక్కువ తీసుకోవడంతో కంట్రోల్ తప్పి అలా ప్రవర్తించానని ఆమె సమాధానమిచ్చింది. 'సునామీ వారియర్', 'బ్రౌన్ షుగర్-2' సినిమాల్లో నటించి మంచి పేరుతెచ్చుకున్న అన్నారీస్ ప్రవర్తన ఆమె కెరీర్ ని దెబ్బ తీసేలా వుందని అంటున్నారు.