: రాజకీయాల్లో 'చదువురాని' వ్యక్తుల అవసరం ఉండదు: రాజకీయాల్లో రజనీ ఎంట్రీ వార్తలపై సుబ్రహ్మణ్య స్వామి
సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని వార్తలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయనపై విమర్శలు గుప్పించిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజు కూడా మరోసారి మండిపడ్డారు. రాజకీయాల్లో 'చదువురాని' వ్యక్తుల అవసరం ఉండదని, తమిళనాడు రాజకీయాలకు రజనీ ఏ మాత్రం సరిపోరని అన్నారు. రజనీకి అసలు రాజ్యాంగం, ప్రాథమిక హక్కుల వంటివి తెలియవని ఆయన పేర్కొన్నారు. రజనీ సినిమాలకి పరిమితమైతేనే బాగుంటుందని, ఆయన బాగా డైలాగ్‌లు చెప్పగలుగుతారని చెప్పారు. ప్రజలకు మంచి వినోదం పంచుతారని అన్నారు. అసలు సినీనటులు రాజకీయాల్లోకి రావడం ఏంటని ప్రశ్నించారు.