: బీజేపీది మైండ్ గేమ్.. వంద మంది అమిత్ షాలు వచ్చినా ఏం నష్టం లేదు: పొన్నం ప్రభాకర్


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేపట్టిన తెలంగాణ పర్యటనను కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. వంద మంది అమిత్ షాలు వచ్చినా తమకు వచ్చే నష్టం ఏమీ లేదని అన్నారు. టీఆర్ఎస్ మాదిరే బీజేపీ కూడా మైండ్ గేమ్ ఆడుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కృతజ్ఞత గలవారని... తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వారు పట్టంకడతారని చెప్పారు. 

  • Loading...

More Telugu News