: షార్ట్ సర్క్యూట్.. ఎస్బీఐ ఏటీఎంలు దగ్ధం!


తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో ఈ రోజు ఉదయం మూడు ఎస్బీఐ ఏటీఎంలు దగ్ధమైనట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని, మూడు ఏటీఎంలు పూర్తిగా దగ్ధమయ్యాయని పేర్కొన్నారు. ఈ మూడు ఏటీఎంలలో శనివారం రూ.70 లక్షల నగదు పెట్టామని, ఎంత నగదు దగ్ధమైందనే విషయమై ఆరా తీస్తున్నామని చెప్పారు. కాగా, అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు. ఈ సంఘటనలో సుమారు కోటిన్నర రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేశారు. 

  • Loading...

More Telugu News