: విన్ డీజిల్ నాతో ప్రేమలో పడ్డాడు: దీపికా పదుకొనే
'ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' సినిమాతో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తనకు ఎన్నో అద్భుతమైన అనుభూతులను ఇచ్చిందని ఆమె తెలిపింది. హీరో విన్ డీజిల్ తనతో ప్రేమలో పడ్డాడని... తాను కలిసిన వ్యక్తుల్లో ఆయనో అద్భుత వ్యక్తి అని చెప్పింది. అతనితో తనకు అద్భుతమైన అనుభవాలు మిగిలాయని తెలిపింది. కేన్స్ ఉత్సవాలకు హాజరైన సందర్భంగా 'ఫ్రెంచ్ 24' అనే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించింది.
70 ఏళ్ల వయసు వచ్చాక ఓ అందమైన, ప్రశాంతమైన కుటుంబ జీవితం ఉండాలని కోరుకుంటున్నానని దీపిక తెలిపింది. ఓ చిన్న ఇంటిలో పిల్లలు, మనవళ్లతో గడపాలనుకుంటున్నానని చెప్పింది.