: ‘బాహుబలి- 2’ కలెక్షన్లు రూ.2000 కోట్లు దాటాలి: ఏఆర్.రెహమాన్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ నిన్న చెన్నైలో 'బాహుబలి 2' సినిమా చూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాల ద్వారా స్పందిస్తూ.. ఈ సినిమా కలెక్షన్లు రూ.2000 కోట్లు దాటుతాయని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ‘రాజమౌళి గారు, కీరవాణి గారు.. చెన్నైలో బాహుబలి 2 చూశా’నని ఆయన ట్వీట్ చేశారు. బాహుబలి-2 సినిమా కలెక్షన్లు ఇప్పటికే 1500 కోట్ల రూపాయలు దాటేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు భారతీయ సినీ చరిత్రలో ఎవ్వరూ సాధించలేని కలెక్షన్లను సాధిస్తూ ఈ సినిమా దూసుకుపోతుంది. ఈ సినిమా సాధిస్తోన్న విజయం పట్ల సినీ ప్రముఖులందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.